నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట సి.ఐ గా టి.కరుణాకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఎన్నికల బదిలీల నేపథ్యంలో జులై 18 తేదిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి స్థానిక సీ.ఐ గా పని చేస్తున్న బొమ్మెర బాలకృష్ణను ఐజీ ఆఫీసు (హైదారాబాద్)కు అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.కాగా ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టౌన్ సిఐ గా పని చేస్తున్న టీ.కరుణాకర్ ను నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా,ఈ మేరకు ఆయన ఇక్కడ భాద్యతలు చేపట్టారు.నూతన సీఐ ను స్థానిక ఎస్సైలు పీ శ్రీకాంత్, శివరామకృష్ణ, ఏ.ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.