– పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చెయాలి..
– జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు చెల్లించాలి..
– మాజీ ఎమ్మెల్యే తాటి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట ప్రధాన మూడు రహదారులు కూడలి లో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి ఐదో రోజు కి చేరింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ నాయకులు తాటి వెంకటేశ్వర్లు సమ్మె శిభిరం వద్దకు చేరుకుని వారికి మద్దతు ప్రకటించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం వారి జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.న్యాయమైన డిమాండ్లను జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600 లు,ఆపరేటర్లకు,ఎలెక్ట్రీషియన్స్,బిల్ కలెక్టర్లకు రూ. 19,500 లు నిర్ణయించాలన్నారు. అలానే గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్లకు గ్రామపంచాయతీ ద్వారా లైసెన్సులు ఇవ్వాలి డిమాండ్ చేశారు. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, సుంకవల్లి వీరభద్ర రావు, అంకిత మల్లికార్జున రావు, దాసరి నాగేందర్ రావు, పానుగంటి సత్యం,అత్తులూరి వెంకట రామారావు, ఎంపీటీసీలు వేముల భారతి, సత్యవరపు తిరుమల బాలగంగాధర్,వేముల భారతి ప్రతాప్,చావా పోలయ్య, మురహరి రాంబాబు, పానుగంటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.