అశ్వారావుపేట సి.పి.ఎస్ లో హాజరైన ఇరువురు విద్యార్ధులు

– మండిపోతున్న ఎండలు
– ఫలితం ఇవ్వని బడిబాట
– మొహం చాటేసిన విద్యార్ధులు
– 3276 మందికి 594 మంది హాజరు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పాఠశాల విద్యాశాఖ జూన్ ఒకటి నుండే ఉపాధ్యాయులను బడిబాట పట్టించి నప్పటికీ పాఠశాలలు ప్రారంభం దినం అయిన సోమవారం విద్యార్ధులు మొహం చాటేశారు.దీనికి కారణం ప్రధానంగా మండిపోతున్న ఎండలు కాగా కొందరు విద్యార్ధులు ఇంకా బడి కి సిద్దం కాకపోవడం మరో కారణం అంటున్నారు విద్యావేత్తలు. అశ్వారావుపేట మండలంలో మొత్తం 92 పాఠశాలలు కు గాను 1 నుండి 10 వ తరగతి వరకు గతేడాది విద్యాసంవత్సరం పాఠశాల చివరి రోజు ప్రకారం 3276 మంది విద్యార్ధులకు మొదటి రోజు అయిన సోమవారం 594 మంది విద్యార్ధులు మాత్రమే హాజరు అయ్యారు.హాజరు శాతం 18.13 గా నమోదు అయింది.అధికారులు తెలిపిన ప్రకారం వివరాలు…

విద్యార్ధులు

తరగతి   మొత్తం                   హాజరు

1 వ    120                            60
2 వ    352                           28
3 వ    302                           98
4 వ    322                           53
5 వ    372                        156
6 వ    355                           09
7 వ    325                          25
8 వ    398                          19
9 వ    324                          55
10 వ   316                        91
మొత్తం  3276                     594

Spread the love