జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మండల వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి, ఆయిల్ఫెడ్ ఆయిల్ ఫాం పరిశ్రమలో డి.ఒ బాలక్రిష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love