ఇంటింటి సర్వే చేయండి…

– రాజకీయ నేతలు, బీఎల్వోలకు సూచనలు
– ఒకే ఇంటి నెంబర్ లో ఆరుగురు  పైన ఓటర్లను పరిశీలించండి….
– అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్లు తొలగింపు లు,చేర్పులు,మార్పుల కోసం బీ.ఎల్వో లు ఇంటింటి కి వెళ్ళి సర్వే పారదర్శకంగా  నిర్వహించాలని అదనపు కలెక్టర్, నియోజక వర్గం ఎన్నికల అధికారి కర్నాటి వెంకటేశ్వర్లు ఆదేశించారు. రాజకీయ పార్టీల నేతలు కూడా సహకరించాలని సూచించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బుధవారం ఆయన రాజకీయ పార్టీల బాధ్యులు,బిఎల్వోలు తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి మృతులు ఓట్లను మరణ దృవీకరణ పత్రాలు పరిశీలించి తొలగించాలని,ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే క్షుణ్ణంగా పరిశీలించి చేర్పులు, మార్పులు,చేపట్టాలని స్పష్టం చేశారు. ఇందుకు ఫాం – 6,8 దరఖాస్తులను పూర్తి చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి 2 కి.మీ దూరంలో ఉన్న ఓటర్లకు సౌకర్యార్ధం కొత్త పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించాలని, ముఖ్యంగా రమణక్కపేట, గోగులపూడి గ్రామాలకు సందర్శించాలని తహశీల్దార్ లూదర్ విల్సన్ ను  ఆదేశించారు.ఒక కుటుంబంలోని ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ మండలాల తహశీల్దార్లు స్వామి(దమ్మపేట),డి.టి రాజా రమేష్(అన్నపురెడ్డిపల్లి ), గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బాధ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,బి.చిరంజీవి(సీపీఐ(ఎం)),తుమ్మ రాంబాబు (కాంగ్రెస్),బండి పుల్లారావు(బీఆర్ఎస్), పలువురు బీఎల్వోలు, పాల్గొన్నారు.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం!
ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసేందుకు జిల్లాలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వరు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన తుదిజాబితాను ప్రకటించనున్నామని చెప్పారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బుదవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.అక్టోబర్ 1వ తేదీకి 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.త్వరలో జరగబోవు ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌళిక సదుపాయాలు ఏర్పాటుపై దృష్టి సారించామని అన్నారు.
Spread the love