ఖమ్మం సభను విజయవంతం చేయండి: బీజేపీ

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఖమ్మం నగరంలో ఈనెల 15వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సన్నాహక సమావేశంలో సభ విజయవంతం కోసం నియమించిన ఇన్చార్జి లు బసవ పాపయ్య గౌడ్,అందె బాబయ్య ముదిరాజ్ లు కోరారు. అశ్వారావుపేట నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి డాక్టర్ భూక్యా ప్రసాద్ రావు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాపయ్య గౌడ్ మాట్లాడుతూ కేసిఆర్ మోసపూరిత హామీలతో తెలంగాణ ప్రజలను రెండుసార్లు మభ్య పెట్టారని మూడోసారి సైతం అధికారంలోకి రావడం కోసం ప్రజలను మోసం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడని అన్నారు.కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి హామీని విస్మరించి పేద రైతన్నల నోట్లో మట్టి కొట్టాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలంటే కేసిఆర్ ని ఇంటికి పంపించాలని భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి తరలివస్తున్నారని అన్నారు. కేసిఆర్ మోసపూరిత హామీలతో మోసపోయిన రైతులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో అమిత్ షా బహిరంగ సభకు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. మండలంలోని ప్రతి బీజేపీ నాయకుడు పోలింగ్ బూత్ ల వారీగా జన సమీకరణ చేయాలని అశ్వారావుపేట మండలం నుండి అత్యధికంగా బిజెపి కార్యకర్తలను అమిత్ షా సభకు తరలించాలని పార్టీ కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి డా.భూక్య ప్రసాదరావు,మండల అధ్యక్షుడు మెట్ట వెంకటేష్,నియోజకవర్గ కన్వీనర్ గొట్టిపూళ్ల శ్రీనివాస్, సొలస పుష్కర్ కుమార్, ఉడతనేని విశ్వేశ్వరరావు, బండారు చంద్రశేఖర్,నైనవరపు రాజేష్,రాయుడు ఆంజనేయులు, దాసరి వెంకన్న బాబు, రావిక్రింది కుమార్ రాజా, నల్లపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love