ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
నిజాయితీ పరులైన కార్యకర్తలు,నాయకులు తోడు – నీడగా నా వెన్నంటే ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అశ్వారావుపేట,దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో ఘనంగా వేడుకలను నిర్వహించి  శుభాకాంక్షలు తెలిపారు. సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రం అయిన అశ్వారావుపేట లో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరై కేక్ కట్ చేసి కార్యకర్తలకు పలువురు నాయకులు, అధికారులు, కుల సంఘాల ఆద్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాలు,మెమెంటో లతో ఘనంగా సత్కరించారు.స్థానిక అమ్మ సేవా సదనంలో నాయకులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పుట్టిన రోజు పురస్కరించుకుని అన్న సంతర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి శ్రీరామ మూర్తి,వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు, రైతు బంధు జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, నాయకులు మందపాటి మందపాటి రాజమోహన్రెడ్డి, మండల అధ్యక్షులు బండి పుల్లారావు, జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్ గొరవర్తి వెంకటేశ్వరావు, కాసాని చంద్రశేఖర్, బిర్రం వెంకటేశ్వరావు, చిప్పనపల్లి బజారయ్య, రాజశేఖర్ లు పాల్గొన్నారు.

Spread the love