ముంబై-విజయవాడ విమాన సర్వీసు పున:ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్: కొవిడ్ సమయంలో రద్దయిన ముంబై- విజయవాడ విమాన సర్వీసులను జూన్ 15 నుంచి పున:ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. రోజూ మ.3.55కు ముంబై నుంచి బయలుదేరి సా.5.45కు గన్నవరానికి విమానం చేరుకుంటుందని తెలిపింది. అలాగే ఇక్కడి నుంచి రా.7.10కి బయలుదేరి రా.9 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుతుందని పేర్కొంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి.

Spread the love