నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యని కలిసి అండగా ఉంటానని భరోసా కల్పించినందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొగిలయ్య గొప్ప కళాకారుడని, ఆయన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఈ మేరకు కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఉన్న వీడియోను షేర్ చేశారు. కేటీఆర్ కిన్నెర మొగిలయ్యను కలిసి భరోసా ఇచ్చిన దృశ్యాలను బీఆర్‌ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఆ పోస్టునే కేటీఆర్ షేర్ చేశారు. మొగిలయ్యకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నెలకు రూ.10 వేల పెన్షన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో మొగిలయ్య ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ మొగిలియ్యను కలిసి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Happy to have fulfilled the word I gave to support Padmasri Moguliah Garu who is distressed
He is a great artist and pride of Telangana 🙏 https://t.co/oXP9vCoqCi
— KTR (@KTRBRS) May 5, 2024