హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం: కేటీఆర్‌

 

నవతెలంగాణ – వేములవాడ: హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకొనే శక్తి బీఆర్ఎస్ కే ఉందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వేములవాడ నియోజకవర్గం బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో కరీంనగర్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో పాటు కేటీఆర్‌ పాల్గొన్నారు.‘‘2014లో బడా భాయి మోసం చేసి ఓట్లు దండుకున్నారు. జన్‌ధన్‌ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి రూ.15లక్షలు ఖాతాలో వేస్తామని ఓట్లు వేయించుకున్నారు. 2024లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చోటా భాయి మోసం చేశారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోడీ.. పదేళ్లలో ప్రజలను మోసం చేశారు. డీజిల్‌, పెట్రోల్‌ సహా నిత్యావసరాల ధరలు పెంచేశారు. రహదారుల నిర్మాణం కోసం సెస్‌ వసూలు చేసిన మోడత.. మళ్లీ ఇప్పుడు టోల్‌ రుసుము పేరుతో ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలి. అలా రూ.30లక్షల కోట్లు వసూలు చేసి .. అందులో నుంచి రూ.14.50 లక్షల కోట్లు అదానీ, అంబానీ లాంటి వారందరి రుణాలన్నీ మాఫీ చేశారు.

 

Spread the love