ముగిసింది ప్రచారం… ముందుంది ప్రసాదం!

– ఖరీదైన ఎన్నికలు
– ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తారో మనం అంతకు మించి ఇద్దాం
– సమాలోచన ముఖ్య కార్యకర్తలు
నవతెలంగాణ చందుర్తి:  నేటి తో ఎన్నికల.ప్రచారం ముగిసింది. అంతర్గత ప్రచారమే మిగిలింది.దీంతో గ్రామాల్లో ఓట్ల కోసం అంచనా వేసుకోవడం లో అభ్యర్ధులు గ్రామ స్థాయి నాయకులకు హుకుం జారిచేస్తునారు.ఎన్ని కుల సంఘాలు ఉన్నాయి,ఎన్ని మహిళ సంఘాలు ఉన్నాయని ఇప్పటికే ఆయా పార్టీ నాయకులు సంఘాల సంఖ్య ఆధారంగా గ్రామస్థాయి లీడర్లకు డబ్బులు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తారో మనం అంతకు మించి ఇద్దాం గ్రామస్థాయి ఆయా పార్టీ ముఖ్య కార్యకర్తలు ముందస్తుగా డబ్బులు పంపిణీ చేయ వద్దని ఆలోచనలో పడ్డారు.ఎందుకంటే ఒకరు ఎంత ఇచ్చారో దాన్ని బట్టి అదనంగా ఇవ్వాలని లేక పోతే మనకు ఓట్లు రావు అని చర్చల్లో మునిగారు. దీంతో డబ్బు, మద్యం, ముఖ్య కార్యకర్తలు డంపు చేసుకొని సిద్ధంగా ఉన్నారని మాట వస్తుంది. మహిళ ఉద్యోగ సంఘాలకు చీరల పంపిణీ ? వివిధ పార్టీ నాయకులు మహిళ ల ఓట్ల పై దృష్టి పెట్టారు. మహిళ ఉద్యోగులు,మహిళ సంఘాల కు ఓ జాతీయ పార్టీ తరుపున చీరలను పంపిణీ చేయడానికి మండల కేంద్రానికి మంగళవారం చేరు కున్నట్లుగా తెలుస్తుంది.దీంతో చీరలు వద్దు అని మహిళ లు ససేమిరా అనడం తో డబ్బులు ఇస్తామని నాయకులు చెప్పినట్లుగా వినికిడి. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికలు ఖరీదుగా మరినాయని చెప్పక తప్పదు.

Spread the love