ఉత్తరాఖండ్‌ అడవుల్లో అదుపులోకి వచ్చిన మంటలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌ అడవుల్లో శుక్రవారం కార్చిచ్చు చెలరేగిన సంగతి తెలిసిందే. నైనిటాల్‌ జిల్లాలో మంటలు మరింత తీవ్రం కావడంతో వాటిని ఆర్పివేయడానికి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భారత వైమానిక దళ సిబ్బంది హెలికాప్టర్‌ను ఉపయోగించి బ్యాంబి బకెట్ ఆపరేషన్‌ ద్వారా నీళ్లను మంటలపై వెదజల్లుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలు కొంత మేరకు ఫలించాయి. జిల్లాల్లోని చాలా చోట్ల మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నరేంద్రనగర్ అటవీ డివిజన్‌లోని మాణిక్‌నాథ్ పరిధిలోని మారోరా, ఖానానా సివిల్ ఏరియాల్లో మంటలు పూర్తిగా ఆరిపోయాయని వారు తెలిపారు.

Spread the love