ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్…పంజాబ్, హ‌ర్యానాకు రెడ్ అల‌ర్ట్

నవతెలంగాణ న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో పొగ‌మంచు ద‌ట్టంగా క‌మ్ముకుంది. పొగ‌మంచు కార‌ణంగా విమానాల రాక‌పోక‌ల‌కు తీవ్రం అంతరాయం క‌లుగుతోంది. దాదాపు 120 విమానాల రాక‌పోక‌ల‌పై పొగ‌మంచు ప్ర‌భావం చూపుతోంది. ఈ క్ర‌మంలో 53 విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు. విమానాలు ఆల‌స్యంగా రాక‌పోక‌లు కొన‌సాగిస్తుండ‌టంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు ఢిల్లీలో ఉష్ణోగ్ర‌త‌లు 4 డిగ్రీల సెల్సియ‌స్‌కు ప‌డిపోయాయి. దీంతో రాజ‌ధాని ప్ర‌జ‌లు చ‌లితో వ‌ణికిపోతున్నారు. పొగ‌మంచు కార‌ణంగా విజిబిలిటీ కూడా ప‌డిపోయింది. దీంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. ప‌లు ప్రాంతాల్లో వాహ‌నాల రాక‌పోక‌లు నెమ్మదిగా కొన‌సాగుతున్నాయి. పొగ‌మంచు, చ‌లి తీవ్ర‌త కార‌ణంగా ఐఎండీ అధికారులు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పంజాబ్, హ‌ర్యానాకు రెడ్ అల‌ర్ట్ జారీ చేసిన‌ట్టు పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో 4.8 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. జైపూర్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌కారం ఫ‌తేపూర్‌లో అత్య‌ల్పంగా 2.9 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా, సంగ్రియాలో 3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. శ్రీగంగాన‌గ‌ర్‌లో 4.3, అల్వార్‌లో 4.5, శిక‌ర్‌లో 5, పిలానిలో 5.1, చురూలో 5.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

Spread the love