బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను ఆయన కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. క్రిశాంక్‌ చేసింది తప్పయితే తాను జైలుకు వెళ్తానన్నారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్, తమ పార్టీ నేత పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టాలన్నారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని క్రిశాంక్‌ భార్య సుహాసిని ఆరోపించారు. ఇలాంటి కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఓయూ మెస్‌ల మూసివేతపై సర్క్యులర్‌ను మార్ఫింగ్‌ చేశారన్న అభియోగంపై ఈ నెల 1న క్రిశాంక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Spread the love