నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం బులెటిన్ విడుదల చేసింది. “తమ్మినేని వెంటిలేటర్ సపోర్ట్ ఖమ్మం నుంచి ఏఐజీకి వచ్చారు. ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నాం. ఆయన ఊపిరితిత్తుల్లో నుంచి నీరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. వివిధ విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నాం” అని హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.