సౌరాష్ట్రను వణికించిన స్వల్ప భూకంపం..

నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్‌ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3:18 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.4గా నమోదైనట్లు గుజరాత్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ తెలిపింది. సౌరాష్ట్ర లోని తలాలాకు  ఉత్తర-ఈశాన్యంగా 12 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. భూమి స్వల్ప వ్యవధిలోనే కంపించడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Spread the love