చైనాలో భారీ భూకంపం..111 మంది మృతి

నవతెలంగాణ బీజింగ్‌: చైనా (China)లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతతో వాయవ్య చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 111 మంది మృతి చెందారని, మరో 230 మందికిపైగా గాయపడ్డారని తెలుస్తుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయవ్య చైనాలోని గన్సు (Gansu), కింగ్‌హై (Qinghai) ప్రావిన్సులలో భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీనితీవ్రత 6.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని, గన్సు ప్రావిన్సులోని లాన్‌జ్హౌకు (Lanzhou) 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చైనీస్‌ మీడియా తెలిపింది.

Spread the love