సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి అస్వస్థత

నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.  ఖమ్మంలో ఉండగా ఉదయం ఆయనకు ఊపిరితిత్తుల సమస్య రావడంతో మొదట ఖమ్మంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమ్మినేనికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని.. కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు రావొద్దని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

Spread the love