దేశ వినాశకశక్తి బీజేపీ

BJP is the destructive power of the country– పొత్తుల విచ్ఛిన్నానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌దే బాధ్యత
– ఎర్రజెండాపై విశ్వాసంతో ముందుకెళ్దాం : సీపీఐ (ఎం) వైరా, మధిర నియోజకవర్గాల అభ్యర్థులు భూక్యా వీరభద్రం, పాలడుగు భాస్కర్‌ నామినేషన్ల సందర్భంగా బహిరంగ సభల్లో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీజెపీ దేశ వినాశకర సిద్ధాంతాన్ని ఎదుర్కొ నేందుకే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్దపడ్డాం కానీ అవేదో దేశ ఉద్ధారక పార్టీలు అని కాదని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా కేసీఆర్‌ కోరితే బీజేపీని వ్యతిరేకించే శక్తులుగా సపోర్టు చేశామన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన నాయకులంతా బీజేపీలో జాయిన్‌ అయ్యేవారన్నారు. శుక్రవారం సీపీఐ(ఎం) మధిర, వైరా నియోజకవర్గాల అభ్యర్థులు పాలడుగు భాస్కర్‌, భూక్యా వీరభద్రం నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో మధిర, వైరా పట్టణాలు ఎరుపెక్కాయి. వేలాదిమంది స్వచ్ఛందం గా తరలివచ్చి ప్రదర్శనలో భాగమయ్యారు. భారీ జన సందోహంతో వెళ్లి పాలడుగు భాస్కర్‌, భూక్యా వీరభద్రం నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భ ంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తమ్మినేని మాట్లాడారు. ఇప్పుడు బలమైన నాయకుడిగా కాం గ్రెస్‌ చెబుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎర్రజెండా భిక్షతోనే బలపడిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నా రు. ఎర్రజెండాదే మళ్లీ.. అనే విశ్వాసంతో ముం దుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రధాని పదవినే కాలిగోటి తో సమానంగా చూసిన సీపీఐ (ఎం)కు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మంత్రి పదవులు ఇస్తామనడం హాస్యా స్పదమన్నారు. విఫలమైన పొత్తులకు బీఆర్‌ఎస్‌, కాం గ్రెస్‌లే బాధ్యత వహించాలని సూచించారు. రాజ్యాం గాన్ని, సకల ఆస్తులను బీజేపీ కాంటాల్లో పెట్టి అమ్మే స్తుందని విమర్శించారు. బోడేపూడి వెంకటేశ్వరరావు, కట్టా వెంకట నరసయ్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ వైరా, మధిర సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశం గురించి మాట్లాడే ఏకైక జెండా ఎర్రజెండా : బి. వెంకట్‌
దేశం గురించి మాట్లాడే ఏకైక జెండా ఎర్రజెండా మాత్రమేనని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు బి.వెంకట్‌ అన్నారు. తెలంగాణలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా బీజేపీని గెలవనీయమని ప్రతినబూ నాలని తెలిపారు. బోడేపూడి నిర్మించిన మధిరలో సీపీఐ(ఎం) బలమేంటో చూపించాలని పిలుపు నిచ్చారు. ఖమ్మం జిల్లాలో ఎర్రజెండాలు లేకుండా చేయాలని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్లు, అవకాశవాదులు, డబ్బు సంచులతో వచ్చే వారికి ఎర్రజెండాలు అంటే ఏమిటో చూపిస్తామన్నారు.
కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అవకాశవాద పార్టీలు: సాయిబాబు
కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కోసం, కాంగ్రెస్‌ ఒకసారి అవకాశం ఇవ్వమంటూ వేడుకుంటున్నాయని.. ఈ అవకాశవాద పార్టీలకు బుద్ధి చెప్పేలా ఎన్నికల్లో ఎర్రజెండాలను గెలిపించాలని సీపీఐ(ఎం) జాతీయ నాయకులు సాయిబాబు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటాల్లో సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించని బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
30 ఏండ్ల ముందే బోడేపూడి సుజల స్రవంతి: పోతినేని సుదర్శన్‌
కేసీఆర్‌ మిషన్‌ భగీరథ కంటే 30 ఏండ్ల ముందే బోడేపూడి సుజల స్రవంతి పథకంతో వైరా, మధిర నియోజకవర్గాల్లోని 106 గ్రామాలకు మంచి నీటిని పంపిణీ చేసిన ఘనత సీపీఐ(ఎం)దేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు తెలిపారు. 2.5 ఎకరాల సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు ఉంటే దానిలో లక్ష ఎకరాల చివరి భూము లకు బోడేపూడి కృషి ఫలితంగా నీరందిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి చేసి చూపించా మన్నారు.
కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర నాయకులు జె. వెంకటేష్‌, మధు, రాజారావు, వంగూరి రాములు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఐలూ రాష్ట్ర కార్యదర్శి పార్థసారథి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, కల్యాణం వెంకటేశ్వర్లు, చింతల చెరువు కోటేశ్వరరావు, నాయకులు బండి పద్మ, వాసిరెడ్డి వరప్రసాద్‌, మండవ ఫణీంద్ర, భట్టు పురు షోత్తం, ఎర్ర శ్రీనివాస్‌, విష్ణు, దివ్వెల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
కష్టజీవుల విరాళాలు
కష్టజీవులు చెమట చుక్కలతో తడిసిన డబ్బుల ను సీపీఐ(ఎం) ఎన్నికల నిధికి విరాళంగా ఇచ్చారు. కార్మిక ఉద్యమనేత పాలడుగు భాస్కర్‌కు రూ.3 లక్ష ల వరకు కష్టజీవులు విరాళంగా ఇచ్చారు. ఓ యాచ కురాలు సైతం తన రోజు సంపాదన రూ. 100ను విరాళంగా ఇవ్వటం గమనార్హం. అనేక ట్రేడ్‌ యూని యన్లు, అసంఘటిత రంగ కార్మికులు, సీపీఐ (ఎం) శాఖలు, ఇలా వందలాది మంది ఒక్కొక్కరు రూ.100 నుంచి రూ.50 వేల వరకు విరాళంగా ఇచ్చారు.

Spread the love