రేపు పెంపుడు కుక్కలకు ఉచిత వ్యాధి నివారణ టీకాలు

నవతెలంగాణ తుంగతుర్తి: పెంపుడు కుక్కల ఆరోగ్యంపై యజమానులు అప్రమత్తంగా ఉండాలని,ప్రభుత్వ అందించే వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ప్రాంతీయ పశువైద్యాధికారి డాక్టర్ భయాగాని రవి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి పెంపుడు కుక్కకు పెంపకం దారులు సంవత్సరానికి ఒకసారి రాబిస్ వ్యాధి రాకుండా వ్యాధి నివారణ టీకాలు (యాంటీ రాబిస్ వ్యాక్సిన్) వేయించుకోవాలని తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో రాబిస్ వ్యాధి రాకుండా ఉచితంగా వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సిబ్బంది సుష్మ, బుచ్చిబాబు, గణేష్ తదితరులు ఉన్నారు.

Spread the love