నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఇటీవల ఏప్రిల్ 22న ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు ప్రదానం చేయగా, చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో, రేపు (మే 9) ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన అర్ధాంగి సురేఖ, తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరుకానున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఈ సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు.