నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ మరుసటి రోజు మధురై సమీపంలోని అలంగనల్లూర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జల్లు కట్టు ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తారు. ఈ ఉత్సవాలను ప్రత్యక్షంగా వేల మంది వీక్షిస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి.. వాటిని లొంగదీసుకోవడం అనేది ఈ క్రీడలోని ప్రధానమైన అంశం. ఎద్దులను లొంగదీసుకునేందుకు యువకులు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఉత్సవంలో పలువురు తీవ్ర గాయాలపాలవుతుంటారు. అయినా ఈ ఉత్సవాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలంగనల్లూర్‌లో ఇవాళ మొదలైన జల్లికట్టు ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.