నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామస్థులు. ఈనెల 14న ములుగు నుంచి బయలుదేరి శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో తమిళనాడులోని తేనీ జిల్లా దేవదానపట్టి బైపాస్‌రోడ్డుపై వీరు ప్రయాణిస్తున్న వాహనం డివైఢర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కమలాపూర్‌పూర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.