హైదరాబాద్ లో చిన్నారిని బలిగొన్న బస్సు…

నవతెలంగాణ హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లపై పడిన గుంతల కారణంగా బాచుపల్లిలో రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ వద్ద తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై పాఠశాలకు తీసుకెతున్న కిషోర్ వాహనం గుంతలు కారణంగా స్కిడ్‌ అయ్యింది. దీంతో తండ్రి కుమార్తెలిద్దరూ  కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బస్సు చిన్నారి దీక్షిత(8) పైనుంచి వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కిశోర్‌కు గాయాలయ్యాయి. దీక్షిత బౌరంపేట్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. బస్సు డ్రైవర్ అతివేగమే దీక్షిత మృతికి కారణమని బాచుపల్లి పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలతో అధ్వానంగా తయారయ్యాయని, మరమ్మతులు చేయడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love