ఢిల్లీని కమ్మేసిన పొగమంచు… విమాన స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం

నవతెలంగాణ న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీని ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్మేసింది. తీవ్రమైన చ‌ల్ల‌ గాలులతో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. పొగ‌మంచు కార‌ణంగా విజిబిలిటీ త‌క్కువ‌గా ఉంది. ప‌లు రైళ్ల‌ రాక‌పోక‌లు ఆల‌స్యంగా కొన‌సాగుతున్నాయి. విమాన స‌ర్వీసుల‌కు కూడా అంత‌రాయం క‌లిగింది. ఢిల్లీ విమానాశ్ర‌యంలో ప‌లు విమానాలు నిలిచిపోయాయి. 30 విమానాలు ఆల‌స్యంగా బ‌య‌ల్దేర‌నున్నాయి. 17 విమానాలు ర‌ద్దు అయ్యాయి. దీంతో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేష‌న్ల‌లోనూ ప్ర‌యాణికుల ర‌ద్దీ అధికంగా ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. అంతేకాకుండా, ఉత్తర భారతదేశం అంతటా తీవ్ర‌మైన చ‌లి ఉంటుంద‌ని తెలిపింది. ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్‌లో 3.3 డిగ్రీల సెల్సియ‌స్‌కు ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి. లోధి రోడ్‌లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది.

Spread the love