బీజేపీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

నవతెలంగాణ హైదరాబాద్: బాలికపై లైంగికదాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్మెల్యేపై(BJP MLA Disqualified) అనర్హత వేటు వేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. తొమ్మిదేండ్ల కిందట బాలికపై లైంగికదాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌ను ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నెల 15న శిక్షలు ఖరారు చేసింది. 25 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు పది లక్షల జరిమానా విధించింది. కాగా, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించిన చట్టసభ సభ్యుడ్ని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఆరేండ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలో లైంగికదాడి కేసులో 25 ఏండ్లు జైలు శిక్ష పడిన బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌ను అనర్హుడిగా ప్రకటించారు.

Spread the love