నేతల కోసం కాదు.. రైతుల కోసం గేట్లు తెరవండి: హరీశ్‌రావు

నవతెలంగాణ హైదరాబాద్: కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)  గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదని .. రైతుల కోసమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Ex Minister Harish Rao) అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఆదివారం పర్యటించిన హరీశ్ రావు ఎండిన పంటలు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరికల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్తున్న సీఎం… రైతులు చనిపోతుంటే పరామర్శించేందుకు మాత్రం వెళ్లడం లేదని విమర్శించారు.  ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు రైతుల వద్దకు వెళ్లి వారిలో ఆత్మవిశ్వాసం కల్పించాలని కోరారు.

Spread the love