తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 28 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో ఎన్నో ఏండ్లగా ఆశతో ఎదురుచూస్తున్న పేదల కల సాకారం కాబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించనుంది. డిసెంబరు 28 నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై గ్రామసభలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం సోమవారం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, కాంగ్రెస్‌ నేతలకు రేషన్‌కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించిన కీలక వివరాలను మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు.

Spread the love