నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ, ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవడంతో.. ఇన్నాళ్లు కేసీఆర్ సర్కార్ లో నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇన్ని రోజులు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రభాకర్‌రావు తెలిపారు.
ఇక మరోవైపు, సాంస్కృతిక సలహాదారుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి కూడా తన పదవికీ రిజైన్ చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్ శాంతికుమారికి పంపించారు. అలాగే, కాగా, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు సైతం రాజీనామా చేశారు.
తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు వరుసగా రాజీనామా చేస్తున్నారు. రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. రాజీనామా లేఖలు పంపి వారు వీరే.. కార్పొరేషన్ల చైర్మన్లు డా .దూది మెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా. వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, జూలూరు గౌరీశంకర్, పల్లె రవికుమార్ గౌడ్, పాటి మీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా.ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తో పాటు మరికొందరు ఉన్నారు.
రాజీనామా చేసిన చైర్మన్లు వీరే..
1. సోమ భరత్ కుమార్
చైర్మన్, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
2. జూలూరి గౌరీ శంకర్
చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ
3. పల్లె రవి కుమార్ గౌడ్
చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్
4. డాక్టర్ ఆంజనేయ గౌడ్
చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ
5. మేడె రాజీవ్ సాగర్
చైర్మన్, రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్
6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్
చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ
7. గూడూరు ప్రవీణ్
చైర్మన్, టైక్స్‌టైల్స్ కార్పొరేషన్
8. గజ్జెల నగేష్
చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్.
9. అనిల్ కూర్మాచలం
చైర్మన్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్.
10.రామచంద్ర నాయక్
చైర్మన్, ట్రైకార్.
11. వలియా నాయక్
చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ.
12. వై సతీష్ రెడ్డి
చైర్మన్, రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ
13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
14. రవీందర్ సింగ్
చైర్మన్, పౌర సరఫరాల సంస్థ.
15. జగన్మోహన్ రావు
చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్.