నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయసహకారాలు అందించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని (Kishan Reddy) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు.