బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

నవతెలంగాణ హైదరాబాద్‌: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు.. తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌.. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్ హౌస్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మీడియాతో తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్‌లో చేరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా వచ్చిన వ్యక్తిని కాదని ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

Spread the love