నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. నేడు బీఆర్ఎస్ కు చెందిన చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, సీనియర్ నేత దానం నాగేందర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీఎం, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపారు.