37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

నవతెలంగాణ హైదరాబాద్: అధికారంలోకి వచ్చి 100రోజులకు కాంగ్రెస్‌ నేతలు ఎంతగానో ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల14వ తేదీనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చాలామంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. నామినేటెడ్‌ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని సీఎం రేవంత్‌రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ పదవులిచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో వీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపకరిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. కొందరు నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఆశిస్తున్నారు. టికెట్‌ ఇవ్వలేకపోయినవారికి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులతో సర్దుబాటు చేశారు.

కార్పొరేషన్‌ నూతన ఛైర్మన్ల వివరాలు

నూతి శ్రీకాంత్
బీసీ ఆర్ధిక సంస్థ
శివసేన రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
గుర్ నాథ రెడ్డి పోలీస్ గృహ నిర్మాణ సంస్థ
పటేల్ రమేష్ రెడ్డి పర్యాటక అభివృద్ధి సంస్థ
రాయల నాగేశ్వరరావు వేర్‌హౌస్ కంపెనీ
నెరెల్ శారద మహిళా కమిషన్
ఎన్. ప్రీతమ్ ఎస్సీ కార్పొరేషన్
బెల్లయ్య నాయక్  గిరిజన సహకార సంఘం
రియాజ్  లైబ్రరీ పరిషత్
మెట్టు సాయికుమార్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్
జగదీశ్వరరావు
నీటిపారుదల అభివృద్ధి
జంగా రాఘవరెడ్డి  ఆయిల్ ఫెడ్
అనిల్ మైనింగ్ కార్పొరేషన్
జ్ఞానేశ్వర్  విజయ డెయిరీ
ఎం.విజయబాబు స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ అసోసియేషన్
బండ్రు శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ
నిర్మల ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఎం. మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార సంఘం
ఎస్. అన్వేష్ రెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ
కాసుల బాలరాజు ఆగ్రోస్ కంపెనీ
జనక్ ప్రసాద్ కనీస వేతనాల సలహా మండలి
ఎం.వీరయ్య వికలాంగుల సంస్థ
 మల్ రెడ్డి రామ్ రెడ్డి రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
పి. వీరయ్య  అటవీ అభివృద్ధి సంస్థ
చల్లా నరసింహా రెడ్డి అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఎన్. సత్యనారాయణ హస్తకళల సంస్థ
M.A. జబ్బార్ మైనారిటీ ఆర్థిక సంస్థ
కాల్వ సుజాత  వైశ్య సంస్థ
కె. నాగు  గిరిజన సహకార మరియు ఆర్థిక అభివృద్ధి సంస్థ
. ప్రకాష్ రెడ్డి  స్టేట్ ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్
జైపాల్  అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ
ఎన్.గిరిధర్ రెడ్డి  ఫిల్మ్ డెవలప్‌మెంట్ కంపెనీ
ఎం.. ఫహీమ్ తెలంగాణ ఫుడ్స్
మన్నె సతీష్  స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
పి. అలేఖ్య  సంగీత నాటక అకాడమీ
కె.నరేందర్ రెడ్డి  శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ
వెంకట్రామ్ రెడ్డి  కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ

 

Spread the love