రేపు రెండు గ్యారంటీ పథకాలు ప్రారంభం

నవతెలంగాణ మంచిర్యాల: బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయంలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని… వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం మంచి నీరూ సైతం అందించలేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి సీతక్క (Seethakka) మండిపడ్డారు. రెండు పంటలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు కూడా ఇక్కడ లేవన్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే గులాబీ నేతలు సహించలేకపోతున్నారని సీతక్క విమర్శించారు.
శుక్రవారం ఇంద్రవెల్లిలో నిర్వహించే సీఎం బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివాసి బిడ్డనైన తనకు ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం అదృష్టమని ఆమె అభిప్రాయడ్డారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని  సీతక్క తెలిపారు.  సీఎం రేవంత్‌రెడ్డి(CM REVANTH REDDY) ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల్లో రెండింటిని కేస్లాపూర్‌ నాగోబా ఆలయం నుంచి ప్రారంభిస్తారని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు.

Spread the love