ఎమ్మెల్యేకు కృతఙ్ఞతలు తెలిపిన సిద్దాపూర్ గ్రామస్తులు

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని జుక్కల్ మేజర్ జీపీ పరిదిలోని సిద్దాపూర్ గ్రామములోని చెరువు కట్ట పైన దశాబ్దకాలం క్రితం  రోడు వేసారు. కొన్నెండ్లుగా చెరువు కట్టపైన రోడుకు  ఇరువైపుల ముళ్ల పోదలు పెరిగి పోయాయి. సీసీరోడ్డు నాణ్యతగా  నిర్మాణం చేయక పోవడంతో  రోడ్డుకు చీలీకలు ఏర్పడి  గుంతలు ఏర్పడ్డాయి. ముళ్లపోదలు ఇరువైపుల పెరిగిపోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహానాలు వాహనదారులకు కనపడక పోవడంతో  ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డు మార్గాన మైబాపూర్ మరియు మహరాష్ట్ర , కర్ణాటక సరిహద్దు గ్రామాలకు కూడా ఇదే దారీ కావడం వలన ట్రాఫిక్ బాగానే ఉంటుంది. పట్టించుకోవాల్సిన గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ముళ్ల పోదలు చెట్లుగా మారాయి. వాహనదారులు వెళ్తున్న క్రమంలో ముళ్లు గీరుకోవడం, కళ్లకు కుచ్చుకోనిపోవడం , ఎదురుగా వచ్చే  వాహనాలు కన్పించక పోవడంతో ప్రమాదాలు జరుగుతన్నాయి. స్థానికులు , స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీ లక్ష్మన్ పటేల్  జుక్కల్ ఎమ్మెలే  తోట లక్ష్మీకాంతారావ్  దృష్టికి తీసుకెళ్ళడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ముళ్ల పొదలు తొలగించాలని సంభందిత శాఖ అధికారులకు,  స్థానిక నాయకులకు ఆదేశించారు.  గురవారం నాడు ముళ్లపొదలు యంత్రాలతో తొలగించెందుకు పనులను ప్రారంభించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాంతారావ్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
Spread the love