ఇండియా కూటమిని చూసి మోడీ భయపడుతున్నారు : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి కేంద్రంలో ఇండియా కూటమిదే విజయం అన్నారు. తరచూ 400 సీట్లు అంటూ మోడీ, అమిత్ షాలు దేశ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ కావాలనే రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓడిపోయే పరిస్థితి లేదని.. రాహుల్‌కు పారిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీ బడా నేతలంతా విదేశాలకు పారిపోతారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిని చూసి మోడీ భయపడుతున్నారన్నారు. మోడీ పదేళ్ల పాలనలో అదానీ, అంబానీలకు మాత్రమే న్యాయం చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడా లేదని.. చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. ఫలితాల తర్వాత వాస్తవ పరిస్థితి వారికే తెలుస్తుందని చెప్పారు. మోడీ వల్ల ఒక్క మంచి పని జరుగలేదని అన్నారు. మణిపూర్‌లో మహిళల బట్టలు విప్పి నడిపిస్తే మోడీ కనీసం మాట్లాడలేదని అన్నారు.

Spread the love