వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి.  దీంతో మత్స్యకారులు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయమని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చేపలను రక్షిచుకునేందుకు బోరు మోటారు సహాయంతో  చెరువులోకి నీటి వదులుతున్నారు.మత్స్యకారులను ప్రభుత్వం కూడ ఆదుకోని,  నష్ట పరిహారం అందిచాలని కోరుకుంటున్నారు.

Spread the love