తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య.. బహిరంగ సభలో ఘటన

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బహిరంగ సభలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లోని హసన్‌నగర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగసభ మధ్యలో నుంచి తరుముకుంటూ వెళ్లి.. వెంటాడి మరీ అందరూ చూస్తుండగానే దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది. దీంతో బహిరంగ సభ రాసభాసగా మారింది. భయాందోళనతో జనం పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : తెలంగాణలో ఒక్కరోజే 19 మంది మృతి..బయటకు రాకండి

Spread the love