వాళ్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం: రాహుల్‌ గాంధీ

నవతెలంగాణ – నిర్మల్‌: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యం. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెద్దలకు బీజేపీ రుణమాఫీ చేస్తే మాత్రం ఎవరూ అడగటం లేదు. ఈ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరగుతున్నాయి. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్‌ ఉంది. మరోవైపు దాన్ని మార్చే సమూహం ఉంది’’ అని రాహుల్‌ తెలిపారు.

Spread the love