ఈ నెల 9వ తేదీ లోపు రైతు బంధు వేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై మాట తప్పమని.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మే 5వ తేదీ ఆదివారం నిర్మల్ లో కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మోడీ, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ గడ్డపై నుంచే పోరు చేశానన్నారు. గత పదేళ్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే.. దేశంలోని సంపదను మోదీ.. అదానీ, అంబానీలకు దోచిపెట్టారని చెప్పారు. ఈ పదేళ్లలో మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ ఓడొగట్టామని.. ఫైనల్స్ లో బీజేపీని ఓడించాలని పిలపునిచ్చారు. రాహుల్ గాంధీ బలహీన వర్గాల గుండె చప్పుడని.. కాంగ్రెస్ గెలిస్తే ఆయన ప్రధాని అవుతారని సీఎం అన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా తొలిసారి ఆడబిడ్డకు చాన్స్ ఇవ్వండని కోరారు. సీసీఐని తెరిపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈనెల 9వ తేదీ లోపు రైతుబంధు డబ్బులు వేసే బాధ్యత తనదేనని.. ఇంద్రవెళ్లి అమరవీరుల సాక్షిగా పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తానని మరోసారి సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Spread the love