తెలంగాణలో మరో 14వేలకు పైగా ఇంజినీరింగ్‌ సీట్లు

Engineering Seats
Engineering Seats

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కోర్‌ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్‌ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. ఫలితంగా అదనపు సీట్లతో ఏటా సర్కారుపై రూ.27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సీట్ల సంఖ్య 1,00,671 చేరింది.

Spread the love