అశ్వారావుపేట వాసికి తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పదవి..

– రమాదేవి కి పలువురి అభినందనలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం కు చెందిన బొడ్డపాటి రమాదేవి కి  తెదేపా తెలంగాణ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి హోదా దక్కింది.ఈ మేరకు ఆ పార్టీ నియోజక వర్గం ఇంచార్జీ కట్రం స్వామి శనివారం వెళ్ళడించారు. పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు బొడ్డపాటి రమాదేవి సేవలు అందిస్తున్నారు.పార్టీకి అందించిన సేవలను గుర్తించి బొడ్డపాటి రమాదేవి ని రాష్ట్రస్థాయి పదవి వరించడం పట్ల నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love