నవతెలంగాణ – నసురుల్లాబాద్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు తికమక పడ్డారు. మువ్వెనల జెండా ఎగురవేసిన తరువాత ఏ గీతం అలపించాల్లో తెలియక తికమక పడ్డారు. కొన్ని చిట్ల జనగణమన అలపించగా మరి కొన్ని చోట్ల జయ జయ జయయే తెలంగాణ గీతంను ఆలపించారు. ఎక్కడ ఏ గీతం అలపించాల్లో తెలియక అధికారులు ప్రజాప్రతినిధులు తికమక పడ్డారు. గీతం అలపించడానికి పిల్లలు రాక పోవడంతో సెల్ ఫోన్ ద్వారా గీతం ఆలపించారు. అధికారులే తికమక పడడంతో గీతం అలపించడానికి వచ్చిన ప్రజలు ఏమి జరుగుతుంది అంటూ ప్రశ్నించారు. బాన్సువాడ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలంలో ఇలా తికమక పడడంతో అధికారులకు వివరణ కోరగా రెండు గీతాలు అలపించవచ్చునని అన్నారు.. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గీతం అలపించాలని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఇందులో ఏదీ సరైంది అంటూ ప్రజలు ప్రశ్నించారు.