తిరుపతి బీసీ జాతీయ మహాసభలో నిజామాబాద్ నాయకులు

నవతెలంగాణ- కంటేశ్వర్
తిరుపతిలో సోమవారం జరిగిన అఖిల భారత బీసీ 8వ జాతీయ మహాసభలో పెద్ద ఎత్తున  నిజామాబాద్ బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది బయల్దేరి సభలో పాల్గొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ మహాసభలో దేశం నలుమూలల నుండి బీసీ నాయకులు పాల్గొనడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభలో పాల్గొన్న వక్తలు అందరు తమ ఉపన్యాసం తో బీసీలను జాగృతం చేసారు. మేమెంతో మాకంత వాట డిమాండ్ చేసారు.తిరుపతి సభలో పాల్గొన్న వారిలో నరాల సుధాకర్, మాడవేడి వినోద్ కుమార్, ధర్శనం దేవేందర్, కరిపె రవిందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, లక్ష్మీనారాయణ, శేఖర్, ప్రశాంత్, విజయ్, మహేష్, సంజీవ్ బాలన్న, రమణచారి, సదానంద్ , మురళి తదితరులు ఉన్నారు.

Spread the love