త్వరలో నిజామాబాద్ నగరానికి మంత్రి వర్యులు కేటీఆర్

నవతెలంగాణ – కంటేశ్వర్

ఐటి హబ్, నూతన మున్సిపల్ భవనం, మినీ ట్యాంక్ బండ్  దుబ్బా, అర్సపల్లి,వర్ని రోడ్ వైకుంఠదామలు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ త్వరలో నిజాంబాద్ కు రానున్నారని నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మంగళవారం తెలిపారు.  ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే  గణేష్ బిగాల పచ్చదనం విరజిల్లెల ఆహ్లాదకరమైన వాతావరణం లో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం ప్రజల సౌకర్యార్థం సమీకృత మార్కెట్- సరికొత్త డిజైన్లతో సకల సదుపాయాలతో మోడల్ మార్కెట్ నిర్మాణం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలయం నిజామాబాద్ నిజామాబాద్ కీర్తిని పెంచేలా కళ భారతి నిర్మాణం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే విగల గణేష్ గుప్తా స్వయంగా వెళ్లి చూశారు.  నిజామాబాద్ నగరం లో వివిధ అభివృద్ధి పనులనుమంత్రి వర్యులు కేటీఆర్ ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల  మాట్లాడుతూ..నిజామాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది.నిజామాబాద్ నగరం పట్టనికరణ చెందుతుండటం తో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తున్నాము.నిజామాబాద్ ప్రాంత యువత కోసం నిర్మించిన ఐటీ హబ్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది.ప్రజలకు సులభతరమైన సేవలు అందించడానికి ఆధునిక హంగులతో నూతన మున్సిపల్ భవనాన్ని నిర్మించాము.తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, కవులకు,కళ కారులకు,రచయితలకు నిలయం నిజామాబాద్ నగరం. నిజామాబాద్ నగరం కీర్తిని పెంచేలా కళ భారతి నిర్మిస్తున్నాము.నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద తీరడానికి రఘునాథ చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ నిర్మించాము.చివరి మజిలీ ఘనంగా నిర్వహించేందుకు ఆధునిక సదుపాయాల తో హైదరాబాద్ తరహాలో వైకుంఠ దామలు నిర్మించాము.ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు సమీకృత మార్కెట్ లు నిర్మిస్తున్నాము.మరి కొద్ది రోజుల్లో ఐటి హబ్, నూతన మున్సిపల్ భవనం, మినీ ట్యాంక్ బండ్  దుబ్బా, అర్సపల్లి,వర్ని రోడ్ వైకుంఠదామలను గౌ.పురపాలక పట్టణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్  ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్ మరియు అధికారులు పాల్గొన్నారు.
Spread the love