నుడా కార్యాలయంలో దశాబ్ది ఉత్సవ వేడుకలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నుడా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకలను నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నుడా వైస్ చైర్మన్ చిత్ర మిశ్రా, నుడా అడ్వైసరి మెంబర్లు, నుడా స్టాఫ్ పాల్గొన్నారు. నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధ పధంలో దుసుకుపోతున్నదని, మన తెలంగాణను బంగారు తెలంగాణ గా, హరిత తెలంగాణ గా మార్చుకోవడానికి అందరి సహాయ సహకారాలు యిలాగే అందించాలని కోరారు. గడిసిన పది సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందుబాతులోకి తెచ్చామని ముందు ముందు మరెన్నో కార్యక్రమాలను రూపొందిస్తామని తెలంగాణ అభివృద్ధి బి.ఆర్.ఎస్ పార్టీ లక్ష్యమని అందుకు మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Spread the love