బీసీ సంఘ సర్వసభ్య సమావేశం..

నవతెలంగాణ – కంటేశ్వర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం సర్వ సభ్య సమావేశం బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ఆధ్యర్యంలో గురువారం నిర్వహించారు. సమావేశంలో పలు బీసీ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం చేతి వృత్తుల వారికి ఇస్తున్న లక్ష సహాయం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఈ ఆర్థిక సహాయం కేవలం 15 కులాలకు మాత్రమే కాకుండ ఇంకా వెనకబడిన కులాలు దాదాపు 20 కులాలు ఉన్నందున వారికి కూడ ఈ ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ నగరంలో బీసీ భవనం కొరకు కూడ స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ.. బీసీలు సంఘటితం అయి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ మాట్లాడుతూ బీసీ అన్ని విధాల ఎదగాలంటే రాజకీయంగ అవకాశాలు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు, బీసీ సంఘం నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, లక్ష్మణ్ గౌడ్, పూల్గం మోహన్, మధుసూదన్, కరిపే రవిందర్, సంజీవ్, రమణ స్వామి,బాలన్న, అనిల్, గోపి, గంగాధర్, లక్ష్మీనారాయణ, నరేష్, సాయిలు, బసవ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love