పాఠశాలలకు..మహార్ధశ పట్టేనా!

– మనఊరు-మన బడి మాదిరే…
– పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు శ్రీకారం
– జూన్‌ నాటికి పనుల పూర్తికి కసరత్తు
– అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు నిధులు
– ఎస్‌హెచ్‌జీ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధి పనులు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన కోసం గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కొనసాగింపుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పనులు చేపట్టింది. పాఠశాలల అభివృద్ధి కోసం విద్యా శాఖ కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే స్కూల్‌ యాజమాన్య కమిటీల బదులు కొత్త ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన పనులు పూర్తి చేయడంలో జాప్యం జరిగింది. పాఠశాలల పునప్రారంభం నాటికే మంజూరైన పనుల్ని పూర్తి చేసేందుకు నిర్మాణ పనుల్ని స్వయం సహాయ సంఘాల మహిళలకు అప్పజెప్పనున్నారు.
గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల్ని కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. మూడు దశల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు 12 రకాల మౌళిక సదుపాయాల్ని కల్పించేందుకు కార్యాచరణ రూపొందించారు. మొదటి దశలో చేపట్టిన పనుల్లోనే వేగం కనిపించింది. రెండో దశలో గుర్తించిన పనులు నత్తనడకన సాగాయి. ముఖ్యంగా రూ.30 లక్షలకు పైబడిన వ్యయంతో చేపట్టిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనుల్ని మధ్య లోనే వదిలేశారు ఇంతలోనే ఎన్నికలొచ్చి ప్రభుత్వం మారింది. దీంతో రెండో దశ మంజూరైన పనులు, మూడో దశలో చేపట్టాల్సిన పనులు పక్కన పడ్డాయి. రాష్ట్రంలో కొత్త గా ఏర్పడిన ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలకు మహా ర్ధశ వచ్చేలా చేసేందుకు పూనుకుంది. సంగారెడ్డి జిల్లాలో1262 ప్రభుత్వ పాఠశాలలున్నాయి.. మెదక్‌ జిల్లాలో 923, సిద్దిపేట జిల్లాలో 976 స్కూల్స్‌ ఉన్నాయి. వీటిల్లో మొదటి, రెండో దశల్లో కొన్ని స్కూళ్లల్లోనే పనులు చేపట్టారు. అవి కూడా సగం వరకు పూర్వవ్వలేదు దీంతో రాష్ట్ర ప్రభ ుత్వం మూడు జిల్లాల్లోని పాఠశాల్లో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నిధుల్ని మంజూరు చేసింది.
2 వేల పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు…
ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 2 వేల ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లాలో 763 ప్రభు త్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద అభివృద్ధి చేయ నున్నారు. ఇందు కోసం రూ.27 కోట్ల నిధుల్ని కూడా ప్రభు త్వం మంజూరు చేసింది. మెదక్‌ జిల్లాలో 500, సిద్దిపేట జిల్లాలో 750 స్కూల్స్‌ల్లో వివిద రకాల పనులు చేపట్టేం దు కు నిధుల్ని మంజూరు చేశారు. గుర్తించిన పనుల్ని చేపట్టేం దుక పబ్లిక్‌ హెల్త్‌, పంచాయతీరాజ్‌, టీఎస్‌ఈడబ్యూ ఐడీసీ, ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ శాఖలకు అప్పజెప్పారు. ఆయా ఇంజ నీరింగ్‌ విభాగాలు చేపట్టాల్సిన పనులను గ్రౌం డింగ్‌ చేస్తు న్నారు. మరికొన్ని పనులు ఇప్పటికే ప్రారంభ మయ్యాయి. పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల్లో 25 శాతం డబ్బుల్ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతాల్లో జమ చేశారు.
జూన్‌ నాటిని పనులు పూర్తయ్యేనా..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల్ని కల్పించేం దుకు చేపట్టే పనులు పాఠశాలల పున ప్రారంభం నాటికి పూర్తయ్యేనా అనేది అనుమానంగా మారింది. గత ప్రభుత్వం కూడా ఏ ఏడాదిలో మొదలు పెట్టిన పనుల్ని ఆ ఏడాదిలోనే పూర్తి చేయాలని చెప్పింది. కానీ.! రెండేళ్లలల్లో చేపట్టిన పను ల్లో 60 శాతం కూడా పూర్తవ్వలేదు. రూ.30 లక్షలకు పైబడి న వ్యయంతో చేపట్టిన పనుల్లో తీవ్ర నిర్లక్షం కొనసాగింది. బడా కాంట్రాక్టర్లు పనుల్ని దక్కించుకుని సకాలంలో పూర్తి చేయకుండా నత్తకు నడకనేర్పిన చందంగా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా పనులు నిర్ణయించిన సమయానికి పూర్తి చేయాల్సి ఉంది. ఏఫ్రిల్‌, మే రెండు నెలల కాలంలోనే పను ల్ని చేయాల్సి ఉంటది. జూన్‌లో బడులు తెర్చితే పనులు చేయడం కష్టమవుతుంది. పాఠ శాలల్లో అవసరమైన నిర్మా ణ పరమైన ప్రహారీ గోడలు, తరగతి గదులు, వంట గ‌దులు, మరుగుదొడ్లు పనులు చేయాల్సి ఉంటది. వీటికే అధిక సమయం పట్టుద్ది. అదే విధంగా కలర్లు వేయ డం, పర్నీచర్‌ సమకూర్చడం, కం ప్యూటర్స్‌ ఏర్పాటు, మంచి నీటి సదుపాయం, ఆట స్థలాలు, క్రీడా వస్తువులు, గ్రంథాల యం, ల్యాబ్‌ వంట పనులు చేయా లి ఆయా పాఠశాలల్లో మౌళిక సదుపాయాలకు సంబంధించి ఏమి ఉన్నాయి..? ఏమి లేవనే నివేదికల ఆధారంగా పనులు గుర్తించి నిధులు కేటాయించారు. సకాలంలో పనులు జరిగేలా చూడడంతో పాటు బిల్లుల్ని కూడా చెల్లిస్తేనే పనులు జూన్‌ నాటికి పూర్తయ్యే అవకాశముంది.

763 పాఠశాలల్లో పనులు
సంగారెడ్డి జిల్లాలో 763 ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ఎంపిక చేయబడ్డాయి. వీటిల్లో వివిద రకాల పనుల కోసం రూ.27 కోట్ల నిధులు అవసరముంది. వీటిని ప్రభుత్వం మంజూరు చేసింది. 25 శాతం నిధుల్ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతాల్లో జమ చేశారు. సకాలంలో పనుల్ని పూర్తి చేసేందుకు ఆయా ఇంజనీరింగ్‌ విభాగాలు పనిచేయనున్నాయి. పనులు వేగంగా పూర్తి చేసేందుకు కలెక్టర్‌ స్థాయిలో రెగ్యులర్‌గా సమీక్షలు జరుగుతాయి.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

Spread the love