కాంగ్రెస్ అనాలోచతో పూర్వపు కరువు : మాజీ ఎంపీ వినోద్

– లక్ష్మిపూర్ లో దెబ్బతిన్న పంటల పరిశీలన
– రుణాలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు వేదించడం దౌర్భాగ్యం
– బ్యాంక్ అధికారులు గ్రామాల్లోకి రాకుండా సీఎం అధేశాలివ్వాలి
– మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం కట్టి నీరందిచాలని డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి: కేసీఆర్ ప్రభుత్వం చెరువులు, కుంటలు నింపడం వల్ల బావుల్లో, బోరు బావుల్లో భూగర్భ జలాలు వృద్ది చెంది రూ.కోట్ల విలువైన పంటలు రైతులు పండించారని.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అనాలోచనతో నీళ్లుండి పంటలకు నీరందించక పూర్వపు కరువు పునరావృతమవుతుందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.బుధవారం మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామంలో ఇటీవల వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే రసమయి, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. రైతులతో మాజీ ఎంపీ మాట్లాడి దెబ్బతిన్న పంటల వివరాలను, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జలశయాలు నింపకపోవడం వల్లే పంటలకు సాగునీరందని దౌర్భాగ్య దుస్థితి నెలకొందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల సమయం కేటాయించకపోవడం,ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతాంగానికి సాగునీరందించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టి కాఫర్ డ్యాం నిర్మించి వాటి ద్వార మిడ్ మానేర్, అన్నపూర్ణ జలశయాలను నింపి చివరిదశలో ఉన్న సాగుపంటలు ఎండిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నీరందించాలని డిమాండ్ చేశారు.పంట రుణాలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు రైతులను వేధింపులకు గురిచేయడం అనాటి ఉద్యమ తెలంగాణ రోజులను తలపిస్తున్నయన్నారు. రూ.2 లక్షల వరకు తీసుకున్న ప్రతి రైతు రుణాన్ని ప్రభుత్వమే చెల్లింపులు చేసేలా సీఎం రేవంత్ రెడ్డి జీఓ జారీ చేసి బ్యాంక్ అధికారులు గ్రామాల్లో తిరగకండా తక్షణమే అధేశాలు ఇవ్వాలని సూచించారు. మిడ్ మానేర్ జలశయంలోని నీరును బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల రైతులకు కాల్వల ద్వార అందించి చివరిదశలో ఎండిపోకుండా ఉన్న పంటలను అదూకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను డిమాండ్ చేశారు.
తాళి అమ్ముకుని రుణాలు చెల్లించాలంటున్నారు
తాళి అమ్ముకుని పంట రుణాలను చెల్లించాలని బ్యాంక్ అధికారులు వేదింపులకు గురి చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల రుణ మాఫి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి విస్మరిస్తోంది. సాగునీరందక సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయి.పంట నష్టపరిహరం చెల్లించి రూ.2 లక్షల రుణమాఫి హామీని ప్రభుత్వం అమలు చేయాలి. – పాకాల పద్మ,మహిళ రైతు, లక్ష్మిపూర్.

Spread the love