నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్ఎస్ యువ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు నీలం మధు ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. తాజాగా నీలం మధు కాంగ్రెస్లో చేరారు. పటాన్ చెరు నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన నీలం మధు టికెట్ రాకపోవడంతో ఆయన తిరగబడ్డారు. పాద యాత్ర చేసి పోటీకి సిద్దం చేసుకున్నారు. ఇంతలో కాంగ్రెస్ అధిష్టానం నీలం మధు పై దృస్టి సారించింది. కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపి కాంగ్రెస్ లోకి అహానించడంతో నీలం మధు హస్తం గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే నీలం మధుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లో చేర్చుకున్నారు. నీలం మధు కాంగ్రెస్ లో చేరడం తో సంగారెడ్డి లో బీఅర్ఎస్ కు నష్టం జరిగే అవకాశం లేక పోలేదు. ముదిరాజ్ సామాజిక వర్గంలో పట్టున్న నీలం మధు కాంగ్రెస్ లో చేరడంతో ఆ వర్గం ఓట్లను ఆకర్షించే అవకాశం ఉంది.